“అలా అనుకునే ఉద్దేశం లేదు – నాగవంశీ క్లారిటీ”

"No intention to think so – Nagavanshi Clarity"
"No intention to think so – Nagavanshi Clarity"

నిర్మాత నాగవంశీ సంక్రాంతికి విడుదల కానున్న మూవీ లపై ఇటీవల చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. ‘సంక్రాంతికి పోటీ ఏమి ఉండదు’ అని చేసిన కామెంట్స్ పై తాజాగా నాగవంశీ క్లారిటీ కూడా ఇచ్చారు. తన కామెంట్స్‌ ని కొందరు తప్పుదోవ పట్టించారని నాగవంశీ అసహనం వ్యక్తం చేశారు. ఇంతకీ, నాగవంశీ ఏం మాట్లాడారు అంటే..‘సంక్రాంతికి ఆరు మూవీ లు వస్తాయి కదా.. పోటీ ఎక్కువగా ఉంటుందా..? అని అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను. ఈసారి అన్ని మూవీ లు రావు. వచ్చినా.. పెద్దగా కాంపిటీషన్ ఉండదు అని చెప్పాను.

"No intention to think so – Nagavanshi Clarity"
“No intention to think so – Nagavanshi Clarity”

అయితే, ఆ కామెంట్‌ని కొందరు సోషల్‌ మీడియాలో తప్పుదోవ పట్టించారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతికి వస్తుందని.. ఆ మూవీ మాకు పోటీ కాదని చెప్పినట్లు మిస్ లీడ్ చేశారు. ఇందులో ఏమైనా అర్థముందా ?. ఈసారి సంక్రాంతికి ఆరు మూవీ లు రావు.. మూడు వస్తాయి. ఇలా విడుదలవడం ఇండస్ట్రీలో సహజమే. నేను ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌ని సోషల్‌ మీడియాలో వాళ్లకి అనుకూలంగా రాసుకున్నారు. ఒక ప్రొడ్యూసర్‌గా నేను మరొకరి మూవీ హిట్‌ కాకూడదని ఎందుకు అంటాను ?, ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేరు’’ అని నాగవంశీ గారు చెప్పుకొచ్చారు .