మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డి వీరద్దరూ ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు. అయితే వీరు ఇద్దరూ పార్టీ మారతారని కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఎందుకు అంటే వారి రెండు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు వారి ఇద్దరికీ మళ్లీ పోటీ చేసే అవకాశం వారికి ఇవ్వవద్దని బాహాటంగానే కోరుతున్నారు. ఎందుకంటే ఎక్కడో ఉన్న వారిని తీసుకువచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవి ఇస్తే కొంత మంది తప్పుడు మాటలు విని లేని వ్యతిరేకత కొని తెచ్చుకున్నారని ‘రావెల’ గురించి చెప్పుకుంటున్నారట.
మరో పక్క నోటి దురుసుతనం, అహంకారంతో ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డి సీనియర్ నేతలను, కార్యకర్తలను అనేకసార్లు అవమానించి చేజేతులారా విలువలు కోల్పోతున్నారని పార్టీ తను ఎంపి, ఎమ్మెల్యేను చేసింది. కేవలం మంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో అనేక పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి తప్పిదాలు చేసి ఇప్పుడు సీటు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారని అంటున్నారు.
పార్టీకి విధేయులుగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంత వరకు ఉన్నారో కానీ ఆర్థిక, కుల అంహకారంతో అందరినీ నోటికి వచ్చినట్లు తిట్టి చివరకు తమ రాజకీయ గమ్యం ఏమిటో తెలియక, టెన్షన్‌తో కొట్టుమిట్టాడుతున్నారు. రావెలకు మళ్లీ పోటీ చేసే అవకాశం చంద్రబాబు ఇవ్వరని ఖాయమయిపోయినట్టేనని చెబుతున్నారు. ఇప్పటికైనా వారు కొంత వరకు సరి చేసుకుంటే పరిస్థితి మెరుగుపడు తుందని భావిస్తున్నారు.
వైకాపాలో వేణుగోపాల్‌రెడ్డి చేరాలనుకుంటే ఆయన దగ్గర బంధువు రాంకీ అయోధ్యరామిరెడ్డి పార్టీలో చేర్చుకునే విధంగా మంత్రాంగం నడుపుతారు కానీ రావెలకు అటువంటి అవకాశం లేదని ఇంతకు ముందు ఆయన తాను వైకాపాలో చేరతానని చెప్పినా వారు తిరస్కరించడం జరిగింది దీంతో ఇప్పుడు ఆయన జనసేన వైపు ఆశగా చూస్తున్నట్టు తెలుస్తోంది.