Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అగ్రరాజ్యం అమెరికాపై ఉత్తరకొరియా మరోసారి విరుచుకుపడింది. తాము అణ్వాయుధాలు వదిలేస్తామని అమెరికా పగటి కలలు కంటోందని ఎద్దేవా చేసింది. ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలకు భద్రతామండలి ఏకగ్రీవ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఉత్తరకొరియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ వ్యాఖ్యలు చేసింది. తమపై ఐక్యరాజ్యసమితి కఠిన ఆంక్షలు విధించడం ఒకరకంగా సైనిక చర్యకు దిగినట్టేనని ఆరోపించింది. ఇలాంటి చర్యలకు అమెరికా పాల్పడడం తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని మండిపడింది. అమెరికా దాని మిత్రదేశాలు ఆ తీర్మానాన్ని తీసుకొచ్చారని తాము భావిస్తున్నామని, ఆంక్షలు విధించడం అంటే కొరియన్ ద్వీపకల్పంలో శాంతికి విఘాతం కలిగించడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తంచేసింది. అమెరికా భద్రంగా జీవించాలంటే డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా పట్ల ఉన్న తన విరుద్ద విధానాలను రద్దుచేసుకోవాలని హితవు పలికింది.
సర్వశక్తులను ఒడ్డి తయారుచేసిన అణ్వాయుధాలను తామెలా వదిలేస్తామని ఉత్తరకొరియా ప్రశ్నించింది.తాము ఇటీవల పరీక్షించిన సరికొత్త బాలిస్టిక్ క్షిపణి అమెరికాలోని ఏ ప్రాంతానికైనా సులభంగా చేరుకోగలదని ఉత్తరకొరియా ప్రకటించిన నేపథ్యంలో కఠిన ఆంక్షల తీర్మానం తెరపైకి వచ్చింది. అమెరికా చేసిన ఈ తీర్మానంపై ఉత్తరకొరియా మిత్రదేశమైన చైనాతోనూ చర్చించారు. అటు ఉత్తరకొరియా వ్యాఖ్యలు చూస్తుంటే.. అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఈ ఏడాది మొదలైన తీవ్ర ఉద్రిక్తతలు వచ్చే ఏడాదీ కొనసాగనున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా భూబాగం గువామ్ లక్ష్యంగా ఉత్తరకొరియా పరీక్షించిన క్షిపణి దాడితో రెండు దేశాల మధ్య తలెత్తిన విభేదాలు ఒక దశలో తీవ్ర రూపం దాల్చి యుద్ధంతప్పని పరిస్థితికి చేరుకున్నాయి. అయితే చైనా జోక్యంతో పరిస్థితి అప్పటికి సద్దుమణిగినప్పటికీ…ఇప్పు