జనాభా రేటు క్షీణతపై ఆందోళన చెందుతున్న ఉత్తర కొరియా అధినేత కిమ్‌

North Korean leader Kim is worried about the declining population rate
North Korean leader Kim is worried about the declining population rate

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ జనన రేటు పెంచాలని తమ దేశ ప్రజలకు కిమ్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్యాంగాంగ్‌లో తల్లుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తమ దేశంలో జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ శక్తిని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న తల్లులకు కిమ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

జనాభా రేటు క్షీణత అనేది ఇది ప్రతి ఒక్కరి ఇంటి సమస్య. జనన క్షీణతను నిలువరించడం ఇప్పుడు ఎంతో ముఖ్యం. శిశు జనన రేటు తగ్గుదలను అడ్డుకుని జననాల సంఖ్యను పెంచాల్సిన అవసరముంది. పిల్లలను సరైన రీతిలో పెంచాలి. వారి సంరక్షణ తల్లుల బాధ్యత. అని ఈ సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ తల్లులకు సూచనలు ఇచ్చారు.

ఈ ఏడాదిలో ఉత్తర కొరియాలో యూఎన్‌ పాపులేషన్‌ ఫండ్‌ అంచనా ప్రకారం సగటు జనన రేటు 1.8 ఉంది. ఉత్తర కొరియాలో 25 మిలియన్ల జనాభా ఉన్న కొన్నేళ్ల క్రితం ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర కరవు సంభవించడం ఆహార సంక్షోభానికి దారి తీసి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కరోనా కూడా లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. ఈ క్రమంలో ఆ దేశంలో జనన రేటు తగ్గడంతో ఆ పరిస్థితిని నిలువరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.