సూపర్​స్టార్​తో పోటీ కాదు – ఆయనతో పాటుగా: తేజ సజ్జ ట్వీట్

సూపర్​స్టార్​తో పోటీ కాదు - ఆయనతో పాటుగా: తేజ సజ్జ ట్వీట్
Cinema News

ఈ ఏడాది సంక్రాంతి బరిలో చాలా మూవీ లు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయితే జనవరి 12 న మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు కారం, మరియు తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన హనుమాన్ మూవీ ల పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ రెండు మూవీ లు కూడా ఒకే రోజున రిలీజ్ అవుతుండటం తో సినీ ఇండస్ట్రీ లో ఈ మూవీ ల పై చర్చ హాట్ టాపిక్ గా మారుతోంది.

సూపర్​స్టార్​తో పోటీ కాదు - ఆయనతో పాటుగా: తేజ సజ్జ ట్వీట్
Mahesh Babu , Teja Sajja

అయితే ఈ రెండు సినిమా లు ఒకే రోజున రిలీజ్ కావడం పట్ల మరోసారి క్లారిటీ ఇచ్చారు. సూపర్ స్టార్ తో పోటీ కాదు అని, ఆయన తో పాటుగా అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ బాబు ఫ్యాన్స్ తేజ సజ్జ చేసిన కామెంట్స్ తో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హనుమాన్ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా, గుంటూరు కారం మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.