లాహిరి లాహిరి లాహిరి, ధనలక్క్క్ష్మీ ఐ లవ్ యూ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటడు ఆదిత్య ఓం.. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ హీరో కొన్నేళ్లుగా ఇండస్టీకి దూరంగా ఉంటున్నాడు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం చేరువలోనే ఉన్నారు. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ మారిన ఆదిత్య తెలంగాణలోని అయిదు గ్రామాలను దత్తత తీసుకొని వాటి బాగోగులు చూసుకుంటున్నారు. బద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చేరుపల్లి సమీపంలోని గ్రామాలను గత అయిదేళ్లుగా దత్తత తీసుకుని వాటి అభివృద్ధి బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. చదవండి: 42 లీటర్ల చనుబాలను డొనేట్ చేసిన నిర్మాత
వీటిని రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదిత్యాతన స్నేహితుడు, నిర్మాత పీవీఎస్ వర్మతో కలిసి ఇటీవల గ్రామాల్లోని 500 రైతులకు మామిడి, కొబ్బరి మొక్కలను అందించారు. అలాగే దత్తత గ్రామాల్లోని యువతను విద్యతోపాటు క్రీడా రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. చేరువల్లి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. కాగా చాలా రోజుల గ్యాప్ ఆనంతరం ఆదిత్యాప్రస్తుతం రాఘవ టీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బందీ అనే సినిమాతో రీఎంటీ ఇవ్వనున్నారు. తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో కేవలం ఒకే పాత్ర ఉండబోతుంది.