విజయ్‌ దేవరకొండ సారీ చెప్పాడు…!

Nota Movie PreRelease Function In Vijayawada

యూత్‌ ఐకాన్‌ విజయ్‌ దేవరకొండ తన అభిమానులకు సారీ చెప్పాడు. తాజాగా విజయవాడలో ‘నోటా’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు జనాలను అంచనా వేయడంలో విఫలం అయ్యారు. ఒక చిన్న ఆడిటోరియంలో కార్యక్రమంను ప్లాన్‌ చేశారు. తీరా చూస్తే ఈ కార్యక్రమంకు భారీ ఎత్తున అభిమానులు వచ్చారు. మొదట వచ్చిన వారికి ఎంట్రీ దక్కింది. కాని ఆడిటోరియం నిండటంతో ఆ తర్వాత వచ్చిన చాలా మందిని వెనక్కు పంపించేశారు. పెద్ద ఎత్తున జనాలు రావడంతో పోలీసుల అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసు వారు చాలా కష్టపడాల్సి వచ్చింది.

nota-movie

విజయ్‌ దేవరకొండ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇంత మంది జనాలు వస్తారని ఊహించలేదు. ఇంతగా ప్రేక్షకులు తనన ఆధరించేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు. లోనికి రాలేక పోయిన ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణలు చెబుతున్నాను అంటూ విజయ్‌ దేవరకొండ అన్నాడు. త్వరలోనే విజయవాడలో మరోసారి కలుద్దాం. అప్పుడు అందరు వచ్చేలా పెద్దగా ప్లాన్‌ చేసుకుందాం అన్నాడు. ‘నోటా’ చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ ఎత్తున అంచనాలున్న నోటా చిత్రం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా విడుదలకు సిద్దం అయ్యింది.

nota-pre-release