దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఈ కరోనా పెరుగుతున్న కారణంగా ప్రజలందరు కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. కాగా అధికారులందరూ కూడా ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహనను కల్పిస్తూ, మానసిక స్తైర్యాన్ని నింపుతున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మహమ్మారి కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగమైన ఒక పోలీసు అధికారికి కూడా కరోనా వైరస్ పాసిటివ్ అని తేలింది. దీంతో సదరు పోలీస్ అధికారులందరూ కూడా భయాందోళనకు లోనవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే… విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఒక ఎస్సైకి పాజిటివ్ అని తెలగా, అప్రమత్తమైన అధికారులు అందరు కూడా అతడిని క్వారంటైన్ కి తరలించారు.
అంతేకాకుండా విజయవాడలో పనిచేసే ఇద్దరు ఎస్సైలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వారిలో ఒక అధికారికి తీవ్రమైన దగ్గు రావడంతో, అతడికి జరిపినటువంటి కరోనా నిర్దారిత పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ఆ పోలీస్ అధికారితో పాటు అతడితో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది 60 మందిని క్వారంటైన్‌కు పంపి, పరీక్షలు నిర్వహించారు. ఇకపోతే కృష్ణ జిల్లా, గుంటూరు, కర్నూల్, శ్రీకాళహస్తిలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరాన్ని పాటిస్తూ, ప్రభుత్వ నిబంధనలను కూడా పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.