చరణ్, ఎన్టీఆర్ లు పది నెలలు లాక్…!

NTR And Charan Booked For Ten Months

రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రం ప్లాప్ తో తల పట్టుకుంటే, ఎన్టీఆర్ మాత్రం అరవింద సమేత సినిమా విజయం తో మంచి జోరుమిధ ఉన్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే మల్టి స్టారర్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని తరువాత షెడ్యూల్ కోసం ఈ నెల 21 నుండి సిద్దం అవ్వుతుంది. రాజమౌళి కూడా కొడుకు మ్యారేజ్ పనులు పూర్తి చేసుకుని ఆర్ ఆర్ ఆర్ సినిమాపై పూర్తి దృష్టి సారించాడు. అందుకోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఓ పది నెలల పాటు లాక్ చేసినట్లు సంచారం ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు పడుతుంది.కావున రాజమౌళి సినిమాలో నటించే హీరో అప్పటి వరకు ఏ సినిమాలో నటించకుండా వెయిట్ చేస్తూ ఉండాలి అందుకని రాజమౌళి తన పంథా మారుస్తూ తన సినిమా కోసం ఈ స్టార్ హీరోస్ ని ఓ పది నెలల పాటుగా లాక్ చేశాడు.

ఈ గ్యాప్ లో సినిమాను రాజమౌళి కంప్లీట్ చేయ్యనున్నాడు. ప్రభాస్ బాహుబలి సినిమా కోసం త్రీ ఇయర్స్ టైం ఇచ్చి మరే సినిమా చెయ్యకుండా అయ్యింది. దర్శకులు కుడా ప్రభాస్ కోసం ఎదురుచూసి, లాభం లేదనుకుని వేరే వాళ్ళతో సినిమాను తీసే పరిస్థికి వచ్చింది. అలాంటి రిస్క్ చరణ్, ఎన్టీఆర్ లు పడకూడదని పది నెలలు వాళ్ల డేట్స్ లాగేసుకున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ నుండి ఫిజికల్ త్రైనేర్స్ స్పెషల్ గా తెప్పించాడు. చరణ్ కూడా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు. చరణ్ హెయిర్ స్టైల్ కోసం రాజమౌళి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఈ నెల 21 నుండి రాజమౌళి రెగ్యులర్ గా షూటింగ్ జరపనున్నాడు. ఈ చిత్రంలో ప్రియమణి ఓ కిలకపాత్రలో నటిస్తుంది. చరణ్, తారక్ ల సరసన నటించే కథానాయకిలకోసం అన్వేషణ జరుగుతుంది. త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం నుండి అనౌన్స్ మెంట్ ఉంటుంది. ఈ చిత్రాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.