ఎన్టీఆర్‌తో కూడా ‘సాహో’ అనిపించింది!

ntr and trivikram movie heroine fixed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘జైలవకుశ’ చిత్రం తర్వాత చేయబోతున్న చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడిగా పేరున్న త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎన్టీఆర్‌ గత మూడు నాలుగు సంవత్సరాలుగా కోరుకుంటున్నాడు. అది ఇన్నాళ్లకు నెరవేరబోతుంది. భారీ అంచనాలున్న వీరి కాంబో మూవీ ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో దర్శకుడు ఎన్టీఆర్‌ సినిమాకు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ మూవీ హీరోయిన్‌ గురించి గత కొన్నాళ్లుగా మీడియాలో చర్చ జరుగుతుంది. మొదట అను ఎమాన్యూల్‌ అని భావించారు. ఆ తర్వాత పూజా హెగ్డే అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం కోసం బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్‌తో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌కు జోడీగా సాహో చిత్రంలో శ్రద్దా నటిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌తో కూడా శ్రద్దా నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. భారీ పారితోషికంతో శ్రద్దాను దర్శకుడు త్రివిక్రమ్‌ ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు జోడీగా శ్రద్దా నటిస్తే ఆ సినిమా స్థాయి అమాంతం పెరిగి పోవడం ఖాయం. ఇదే సంవత్సరం దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు