కాస్టింగ్‌ కౌచ్‌పై వింతగా స్పందించింది

shriya saran Shocking Comments on Casting Couch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లోనే కాకుండా అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఈ మద్య తెగ చర్చ జరుగుతుంది. కొత్త హీరోయిన్స్‌కు అవకాశాలు కావాలి అంటే కొన్ని వదులుకోవాలని, స్టార్‌ దర్శకులు, నిర్మాతల నుండి చిన్న దర్శకులు నిర్మాతల వరకు అంతా కూడా హీరోయిన్స్‌ను వాడుకోవాలని చూస్తారు అంటూ ఇటీవల కొందరు హీరోయిన్స్‌ మరియు నటీమనులు చెప్పుకొచ్చారు. తెలుగుతో పాటు అన్ని భాషల సినిమా పరిశ్రమలో ఈ వ్యవహారం ఉందని బాహాటంగానే కొందరు ఒప్పుకుంటున్న నేపథ్యంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రియ మాత్రం ఆ విషయాన్ని తాను ఒప్పుకోను అంటూ బల్ల గుద్ది మరి చెబుతోంది.

తాజాగా మీడియాతో మాట్లాడిన శ్రియ.. తాను సినిమా పరిశ్రమకు వచ్చి పది సంవత్సరాలు దాటింది. అయినా ఇప్పటి వరకు నా దృష్టికి కాస్టింగ్‌ కౌచ్‌ గురించి రాలేదని, ఒక్కరు ఇద్దరు హీరోయిన్స్‌ ఆ విషయాన్ని ప్రస్తావించినా కూడా వారు కూడా పెద్దగా ఇబ్బంది పడ్డ దాఖలాలు లేవని శ్రియ చెప్పుకొచ్చింది. తెలుగు మరియు తమిళ సినిమా పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించిన శ్రియ ఇలా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తోంది. శ్రియ చెబుతున్న విషయం నిజం అయ్యి ఉండక పోవచ్చు అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. శ్రియ కూడా కాస్టింగ్‌ కౌచ్‌ బారిన పడి ఉంటుందని, కాని ఆ విషయాన్ని ఆమె చెప్పేందుకు ఆసక్తి చూపడం లేదేమో అనే అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది ఆమెకే తెలిసి ఉండాలి.