Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా పవన్‌తో అజ్ఞాతవాసి చేసి అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. నెల రోజుల క్రితమే చిత్రీకరణ ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు నేటి నుండి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించడం జరిగింది. నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. మొదటి షెడ్యూల్లో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. నేటి నుండి ప్రారంభం అయిన ఈ షెడ్యూల్‌ను ఈనెల 25 వరకు కొనసాగించే అవకాశం ఉంది.
ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ ప్రారంభం అయినట్లుగా కొన్ని ఫొటోలను విడుదల చేసిన యూనిట్ సభ్యులు దసరా కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రం సంక్రాంతి వరకు వచ్చే అవకాశం లేదని అంతా భావించారు. కాని త్రివిక్రమ్ శరవేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి దసరాకు ఫ్యాన్స్‌కు కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా ముద్దుగుమ్మ పూజా హెగ్డేను ఎంపిక చేయడం జరిగింది. ఎక్కువ శాతం ఈ చిత్రంను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ దాదాపు పది కేజీల బరువు తగ్గినట్లుగా తెలుస్తోంది. మొదటి రోజే ఎన్టీఆర్ లుక్‌ను రివీల్ చేయడంతో ఫ్యాన్స్ చిత్రంపై ఆశలు భారీగా పెంచేసుకున్నారు. మరి అంచనాలకు తగ్గట్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాను తెరకెక్కిస్తాడో లేదో చూడాలి.