యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే పొలిటిషియన్‌గా కనిపించబోతున్నారా అంటే.. అవుననే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కేజీఎఫ్’ఫేమ్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇందులో తారక్‌ని పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్టు సమాచారం.
ఇంతకు ముందు ఈ సినిమాలో ఎన్టీఆర్ సైంటిస్టుగానో.. మాఫియా డాన్‌గానో నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ స్టోరీ లైన్ అంటూ ఒకటి తెరపైకి వచ్చింది. దీంతో ఇదే ఫిక్స్ అని అంతా అనుకున్నారు. అయితే, దీనిపై మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఎన్టీఆర్ పొలిటీషియన్‌గా చేస్తున్నాడట. అందుకు తగ్గట్లు ప్రశాంత్ నీల్ కథను సిద్దం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఇవి పూర్తయ్యాక ప్రశాంత్ నీల్, తారక్‌ల ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రానుంది. ఇక ప్రశాంత్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.