ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హ్యాపీ.. ఇంత స్పీడ్‌గా వస్తాడుకోలేదు

ntr big boss show star from this month 16

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి ఫ్యాన్స్‌, ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు అంతా కూడా ఎన్టీఆర్‌ ‘బిగ్‌ బాస్‌’ షో కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్‌ను బిగ్‌ బాస్‌ షోలో చూస్తామా అని ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్‌ బిగ్‌ బాస్‌ షోలో సందడి చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. దాంతో ఆగస్టు వరకు ఎన్టీఆర్‌ బిగ్‌ బాస్‌ షో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని అంతా భావించారు. కాని అందరికి షాక్‌ ఇస్తూ ఎన్టీఆర్‌ ఈనెల 16 నుండే స్టార్‌ మాటీవీలో సందడి చేయనున్నాడు. 

స్టార్‌ మాటీవీ వారు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. 12 మంది సెలబ్రెటీలు, 60 కెమెరాలు, 70 రోజులు ఒక పెద్ద ఇల్లుతో బిగ్‌ బాస్‌ షో ఉండబోతుంది. ఈనెల 16న ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారికంగా వెళ్లడి చేయడంతో నందమూరి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. వారంలో రెండు రోజులు శని మరియు ఆదివారంలో ఈ షోను ప్రసారం చేయనున్నారు. రాత్రి 9 గంటల  సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ షోకు రాని విధంగా టీఆర్‌పీ రేటింగ్‌ ఈ షోకు రావడం ఖాయం అంటూ స్టార్‌ మాటీవీ వారు అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఇటీవలే తమిళంలో ప్రసారం అయిన ‘బిగ్‌బాస్‌’షోకు మొదట రెస్పాన్స్‌ అంతగా రాలేదు. కాని మెల్ల మెల్లగా కమల్‌ దుమ్ములేపుతున్నాడు. ఎన్టీఆర్‌ కూడా ‘బిగ్‌ బాస్‌’ షోతో తెలుగులో మరింత క్రేజ్‌ను పెంచుకోవడం ఖాయం అంటూ నందమూరి ఫ్యాన్స్‌ నమ్మకంగా చెబుతున్నారు. మరో వైపు ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రంతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే.