సుప్రీం హీరోకు ఏంటి ఇలా కలిసి వస్తుంది?

Sai Dharam Tej and VV Vinayak new film to start soon

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Sai Dharam Tej And VV Vinayak New Film To Start Soon

మెగా బ్రదర్స్‌ మేనల్లుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాయిధరమ్‌ తేజ్‌ చాలా ఫాస్ట్‌గానే స్టార్‌డం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మెగా హీరో బ్రాండ్‌తో దూసుకు పోతూ, వరుసగా సినిమాలు చేస్తున్న సాయిధరమ్‌ తేజ్‌ సక్సెస్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ముందుకు సాగి పోతున్నాడు. ఒక వైపు బివిఎస్‌ రవి దర్శకత్వంలో ‘జవాన్‌’ అనే చిత్రాన్ని చేస్తున్న సాయి ధరమ్‌ తేజ్‌ అప్పుడే తన తర్వాత సినిమాను కమిట్‌ అయ్యాడు. స్టార్‌ డైరెక్టర్‌ వివి వినాయక్‌ దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌ తర్వాత సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

‘డీజే’ చిత్రంతో సూపర్‌ హిట్‌ను అందుకున్న హరీష్‌ శంకర్‌ ఇప్పటికే సాయి ధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరోసారి సాయి ధరమ్‌ తేజ్‌తో హరీష్‌ శంకర్‌ సినిమాను చేయాలని కోరుకుంటున్నాడు. ఆయనతో సినిమా ఉంటుందని భావిస్తున్న సమయంలో వివి వినాయక్‌ ముందుకు వచ్చాడు. దాదాపు ఆరు నెలలుగా ఖాళీగానే ఉంటున్న వినాయక్‌ ఎట్టకేలకు సాయి ధరమ్‌ తేజ్‌తో సినిమా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ‘దుర్గ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. సెప్టెంబర్‌లో ‘జవాన్‌’ను విడుదల చేయనున్నారు. ఆ వెంటనే ‘దుర్గ’ చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. ‘ఖైదీ నెం.150’ చిత్రం తర్వాత వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అవ్వడంతో ‘దుర్గ’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి వినాయక్‌ వంటి స్టార్‌ డైరెక్టర్‌ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం రావడం సుప్రీం హీరో అదృష్టంగా చెప్పుకోవచ్చు.

మరిన్ని వార్తలు:

లక్ష్మీపార్వతి అప్పుడే మొదలు పెట్టింది

రామాయణంపై పడ్డ వర్మ