లక్ష్మీపార్వతి అప్పుడే మొదలు పెట్టింది

Lakshmi Parvathi Comments On Ntr Biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Lakshmi Parvathi Comments On Ntr Biopic

ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తాను అంటూ వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించాడు. వర్మ ఎప్పుడైతే ఎన్టీఆర్‌ జీవిత చరిత్రతో సినిమాను చేస్తాను అంటూ ప్రకటించాడో అప్పుడే వివాదాలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని బాలయ్యతో తెరకెక్కించే అవకాశాలున్నాయని కొన్ని మీడియాల్లో వస్తున్నాయి. అయితే బాలయ్యతో ఎన్టీఆర్‌ చిత్రాన్ని చేస్తే అన్ని విషయాలు కూడా బయటకు రావు అని కొందరు అంటున్నారు.

వర్మ తెరకెక్కించాలని భావిస్తున్న ఎన్టీఆర్‌ చిత్రంపై అప్పుడే లక్ష్మి పార్వతి స్పందించారు. ఎన్టీఆర్‌ రెండవ భార్య అయిన లక్ష్మి పార్వతి గురించి బాలకృష్ణ నటించే సినిమా అయితే తప్పకుండా బ్యాడ్‌గా చూపిస్తారు. అందుకే ఆమె వర్మ తెరకెక్కించబోతున్న సినిమాలో బాలకృష్ణ నటించవద్దని డిమాండ్‌ చేస్తుంది. ఎన్టీఆర్‌ సినిమా అంటూ తీస్తే ఆ సినిమాలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడును విలన్‌గా చూపించాలంటూ ఆమె డిమాండ్‌ చేస్తూంది. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా వర్మ ఉన్నది ఉన్నట్లుగా సినిమాను తెరకెక్కించాలని లక్ష్మి పార్వతి కోరుతుంది. ఒక వేల కథలో మార్పులు చేసినా, అబద్దాలు చూపించే ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా వివాదం మొదలవుతుందని లక్ష్మి పార్వతి హింట్‌ ఇచ్చింది. ఎన్ని వివాదాలు వచ్చినా కూడా వర్మ తాను అనుకున్నట్లుగా సినిమాను తీసుకుని ముందుకు వెళ్తాడు.

మరిన్ని వార్తలు:

వర్మకు ఓకే చెప్పిన నాగ్‌.. త్వరలో షూటింగ్‌

ఎన్టీఆర్ బయోపిక్ పై వర్మ స్టేట్ మెంట్.