‘ఎన్టీఆర్‌’ లో బాలయ్యకు ఎన్టీఆర్‌ డబ్బింగ్‌..!

Ntr Biopic Movie Dubbing As Sr Ntr

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ మూవీ వచ్చే సంవత్సరం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ‘ఎన్టీఆర్‌’ రెండు పార్ట్‌లుగా విడుదల కాబోతుంది. ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రంలో ఎన్టీఆర్‌ సినీ జీవితాన్ని మరియు ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ చిత్రంలో ఎన్టీఆర్‌ రాజకీయ జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అద్బుతమైన స్క్రీన్‌ప్లేతో దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రాన్ని చక్కగా ప్లాన్‌ చేస్తున్నాడు. క్రిష్‌ దర్శకత్వంతో ఈ సినిమా స్థాయి పెంచేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, ఈ చిత్రం విశేషాలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ చిత్రంలోకి ఏకంగా సీనియర్‌ ఎన్టీఆర్‌ను తీసుకు రాబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతోంది.

‘ఎన్టీఆర్‌’ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ పోసిస్తున్నాడు. బాలకృష్ణ పాత్రకు డబ్బింగ్‌ను ఎన్టీఆర్‌ చేత చెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ అంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ కాదు.. సీనియర్‌ ఎన్టీఆర్‌ తోనే. అవును సీనియర్‌ ఎన్టీఆర్‌ ఈ చిత్రంకు డబ్బింగ్‌ చెప్పబోతున్నాడు. అదేలా అనుకుంటున్నారా.. గతంలో ఎన్టీఆర్‌ నటించిన సినిమాల్లోని డైలాగ్స్‌, మీటింగ్స్‌లో మాట్లాడిన మాటలను తీసుకుంటున్నారు. వాటినే బాలయ్య పాత్రకు పెట్టబోతున్నారు. అలా బాలయ్య పాత్రకు ఎన్టీఆర్‌ డబ్బింగ్‌ చెప్పినట్లు అవుతుంది. అయితే సినిమా అంతా కాదు లే కాని, కొన్ని కీలక సీన్స్‌కు మాత్రం ఎన్టీఆర్‌ వాయిస్‌ మనం వినవచ్చు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ntr