‘ట్యాక్సీవాలా’ జోరు మామూలుగా లేదు.. లాభాలే లాభాలు

Taxiwala First Day Box Office Collections In 10 Crores

విజయ్‌ దేవరకొండకు తెలుగు ప్రేక్షకుల్లో ఏ స్థాయి క్రేజ్‌ ఉందో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన ‘నోటా’ నిరూపించింది. సినిమా చెత్తగా ఉన్నా కూడా సునాయాసంగా బడ్జెట్‌ను రికవరీ చేయడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది. కేవలం స్టార్‌ హీరోలకు మాత్రమే ఇది సాధ్యం. సినిమా బాగా లేకున్నా కూడా వసూళ్లు రాబట్టగల సత్తా విజయ్‌ దేవరకొండకు ఉందని నోటా చిత్రంతో తేలిపోయింది. తాజాగా మరోసారి విజయ్‌ దేవరకొండ స్టామినా తెలుగు సినిమా పరిశ్రమకు తెలిసింది. ట్యాక్సీవాలా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్‌ దేవరకొండ మొదటి రోజే 10 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను, 5 కోట్ల షేర్‌ను దక్కించుకుంది. మొదటి రోజు వసూళ్లతో బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకున్న సినిమాగా ఈ చిత్రం రికార్డు దక్కించుకుంది.

Vijay devarakonda taxiwala

అయిదు కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజే 5 కోట్లకు పైగా షేర్‌ను దక్కించుకున్న కారణంగా ఈ చిత్రం భారీ లాభాలను తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు శాటిలైట్‌ రైట్స్‌ మరియు ఇతర రైట్స్‌ను నిర్మాతలు అమ్మలేదు. సినిమా సక్సెస్‌ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ రైట్స్‌కు ఏకంగా 10 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.

taxiwala

ఇక కలెక్షన్స్‌ 20 కోట్ల వరకు దక్కే ఛాన్స్‌ ఉంది. మొత్తంగా 30 కోట్ల వరకు సినిమా నిర్మాతలకు తెచ్చి పెట్టబోతుందట. 30 కోట్లలో 5 కోట్లు పెట్టుబడి పోతే నిర్మాతకు ఏకంగా పాతిక కోట్ల లాభాలు అంటూ ట్రేడ్‌ వర్గాల వారు లెక్కు వేస్తున్నారు. ఈమద్య కాలంలో స్టార్‌ హీరోలతో సినిమాలు నిర్మించినా కూడా 10 కోట్ల లాభాలు రావడం లేదు. కాని విజయ్‌ దేవరకొండ మాత్రం ఏకంగా 25 కోట్ల లాభాలు తెచ్చి పెట్టబోతున్నాడు.