ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ వేడుకకు… బాలకృష్ణ విశ్వ ప్రయత్నమే చేస్తున్నాడు…!

Balakrishna Does Not Play A Role In NTR Biopic

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ పేరుతో తెరకేక్కిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ చిత్రం విడుదలకు దగ్గర పడుతుండటంతో, ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ వేడుకకు సిద్ధం అవ్వుతుంది. వచ్చే నెల 16 వ తేదిన తిరుపతిలో ఈ వేడుక జరగనున్నది. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధి గా నందమూరి చంద్రబాబు ముఖ్య అతిధి హాజరు కానున్నారు. ఈ వేడుకకు నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ మొత్తంను తీసుకురావాలి అని బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ చాలా పెద్దది, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్లు, మానవలు, మానవరాళ్ళు ఇలా చాలా మంది ఉన్నారు.

NTR Biopic movie Pre-release Business

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం కోసం వాళ్ళందరిని ఒకే తాటి పైకి తేవాలని బాలకృష్ణ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రీ రిలీజ్ వేడుకల్లో ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ ను కొడుకుల చేత.. ఆడియో సిడి ని కూతుళ్ళ చేత ఓపెన్ చేయించాలి అని చిత్ర బృందం ఆలోచిస్తుంది. అయితే ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి, వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి వస్తారో లేదో అనే సందేహాలు ఉన్నాయి. దగ్గుబాటి వెంకటేశ్వరావు రాకపోవచ్చు కానీ పురందేశ్వరి రావచ్చు అనుకుంటున్నారు. ఏది ఏమైనా అందరిని ఒకే తాటి పైకి తీసుకురావాలన్న ఆలోచన గొప్పది. ఈ విదంగానైనా అందరిని ఒకే వేదిక పైన చూశాము అన్న సంతోషం నందమూరి అభిమానుల్లో కలుగుతుంది.

ntr biopic movie release date fixed