ఎన్టీఆర్‌ను చూసి నేర్చుకోండి…

NTR gives Clarity About Rajamouli Multistarrer movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రవర్తన గురించి పలువురు సీనియర్‌లు మరియు దర్శకులు పలు సందర్బాల్లో చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం కోసం ఎన్టీఆర్‌ రెడీ అవుతున్నాడు. ఆ వెంటనే జక్కన్న దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు ఎన్టీఆర్‌ కమిట్‌మెంట్‌ ఇచ్చాడు. రామ్‌ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్‌ మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అయితే ఈ చిత్రం గురించి ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నోరు జారలేదు. మామూలుగా అయితే హీరోలు తాము చేయబోతున్న సినిమాల గురించి అంతా ఇంతా అంటూ చెప్పేస్తారు. కాని పద్దతి ప్రకారం ఒక సినిమా గురించి ప్రకటించే బాధ్యత దర్శకుడు తీసుకోవాలి. సినిమాకు కెప్టెన్‌ కనుక దర్శకుడు సినిమాను ప్రకటించాల్సి ఉటుంది.

మల్టీస్టారర్‌ సినిమా గురించి ఏ చిన్న ప్రకటన వచ్చినా కూడా దర్శకుడు రాజమౌళి నుండి రావాలి తప్ప తాను ఎలాంటి ప్రకటన చేయను, ఎలాంటి వ్యాఖ్యలు ఆ సినిమా గురించి మాట్లాడను అంటూ ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు. తాజాగా ఐపీఎల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎన్టీఆర్‌ ఎంపిక అయ్యాడు. ఆ సందర్బంగా మీడియా సమావేశంను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ను మల్టీస్టారర్‌ గురించి ఏదైనా చిన్న క్లారిటీ ఇవ్వాలని మీడియా మిత్రులు కోరడం జరిగింది. అయితే ఎన్టీఆర్‌ మాత్రం మల్టీస్టారర్‌ గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఒక మంచి సందర్బం చూసి రాజమౌళి ఆ చిత్రం గురించి ప్రకటన చేస్తాడు అంటూ ఎన్టీఆర్‌ తప్పించుకున్నాడు. సినిమా గురించి దర్శకుడు మాత్రమే ప్రకటించాలని ఎన్టీఆర్‌ దర్శకుడికి ఇచ్చిన గౌరవంను తెలుగు హీరోలు అంతా కూడా ఫాలో అవ్వాలని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.