రావణుడొచ్చాడు.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 NTR jai lava kusa teaser Jai Teaser
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూడాలంటే అతని చేసిన సినిమాలు అన్నీ చూడక్కర్లేదు. కనీసం ఒక్క సినిమా కూడా పూర్తిగా చూడక్కర్లేదు. జైలవకుశ టీజర్ చూస్తే చాలు. అతను ఎందుకు యంగ్ టైగర్ అయ్యాడో అర్ధం అవుతుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో మూడు పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో లవ,కుశ పాత్రలతో పాటు రావణుడిని పోలిన నెగటివ్ రోల్ చేస్తున్నాడు. ఆ పాత్ర ని పరిచయం చేసిన జైలవకుశ టీజర్ చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ డైలాగు వింటే భయం వేస్తుంది. ఆహార్యానికి చిన్న అయినా నాడు భూకైలాస్ లో ఎన్టీఆర్ పోషించిన రావణ పాత్రని గుర్తుకు తెచ్చాడు యంగ్ టైగర్.
ఇప్పటిదాకా టాలీవుడ్ టాప్ హీరోలందరికీ ఎన్టీఆర్ స్ట్రాంగ్ ఆపొనెంట్ అనుకుంటే ,ఇప్పుడు టోటల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్ వేసే వాళ్లకి అసలు సిసలు రావణుడిలా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ రావణుడిని చంపాలంటే సముద్రం దాటాలి.ఈ రావణుడిని చంపాలంటే సముద్రమంత ధైర్యం కావాలనే డైలాగ్ ని నత్తిగా పలుకుతూ కూడా ఎన్టీఆర్ ఇచ్చిన హావభావాలు చూస్తే ఎవరికైనా షేక్ వస్తుంది. ఏమైనా ఈ టీజర్ చూసాక రావణుడు తిరిగి వచ్చినట్టు అనిపిస్తోంది. బీ కేర్ ఫుల్ విత్ ఎన్టీఆర్.