Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో చరణ్, తారక్‌లు కలిసి నటించబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మెల్ల మెల్లగా సాగుతున్నాయి. ఇప్పటికే కథ సిద్దం అయ్యిందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మరో వైపు నటీనటుల ఎంపిక మరియు లొకేషన్స్ ఎంపిక కార్యక్రమా జరుగుతుంది. ఈ సమయంలోనే ఈ చిత్రం గురించి మీడియాలో రోజుకో వార్త వస్తూనే ఉంది. తాజాగా మరో ఆసక్తికర వార్త ఒకటి సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ‘బాహుబలి’ చిత్రం తర్వాత రాజమౌళి మాట్లాడుతూ తన తర్వాత సినిమాలో గ్రాఫిక్స్ ఉండకుండా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
ఒక రెగ్యులర్ కమర్షియల్ చిత్రంగా జక్కన్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయాలని భావించినా కూడా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సమయంలో సినిమాకు గ్రాఫిక్స్ తప్పనిసరి అనే నిర్ణయానికి వచ్చారు. పలు సీన్స్ భారీ రేంజ్లో కనిపించేందుకు గ్రాఫిక్స్ తప్పనిసరి అనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. బాహుబలి రేంజ్లో కాకున్నా హాలీవుడ్ స్టైల్లో యాక్షన్ సీన్స్ ఉండేలా చిత్రంను రూపొందించాలి అని జక్కన్న గ్రాఫిక్స్‌ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. ప్రస్తుతం జక్కన్న సినిమా కోసం చరణ్ మరియు తారక్‌లు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.