ఎన్టీఆర్ రామ్‌చరణ్‌ ల ‘దోస్తీ’

ఎన్టీఆర్ రామ్‌చరణ్‌ ల ‘దోస్తీ’

జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’ భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే గిఫ్ట్‌ వచ్చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి తొలి పాటను ‘ఫ్రెండ్‌షిప్‌ డే’ సందర్భంగా ఆగస్ట్‌1న ఉయయం 11గంటలకు విడుదల చేశారు. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో ‘దోస్తీ’ అంటూ సాగే ఈ థీమ్‌ సాంగ్‌ చివర్లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కనిపించారు.