Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాస్ మహారాజ రవితేజ తాజాగా ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత రవితేజ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన రవితేజకు మంచి సక్సెస్ దక్కింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంకు పెట్టిన బడ్జెట్ మొదటి వారం రోజుల్లోనే రికవరీ కాబోతుంది. మొదటి రెండు రోజులు భారీగా వసూళ్లు రాబట్టింది. రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు ఈ సినిమా సాధిస్తుందనే నమ్మకంను మొదటి నుండి చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా ఆ స్థాయిలో వసూళ్లను రాబడుతూ ఉంది.
ఇక ఈ చిత్ర కథను మొదట రవితేజకు కాకుండా ఎన్టీఆర్‌కు వినిపించినట్లుగా మొదట ప్రచారం జరిగింది. సుప్రీం చిత్రంకు ముందే ఎన్టీఆర్‌తో అనీల్ రవిపూడి సినిమా చేయాలని ప్రయత్నించాడు. అందుకు కొన్ని కథలు కూడా చెప్పడం జరిగింది. అందులోని ఒక కథ రాజా ది గ్రేట్. ఎన్టీఆర్ మొదటి నుండి కూడా ప్రయోగాత్మక చిత్రాలకు ఆసక్తి చూపిస్తూ వచ్చాడు. అయితే అంధుడిగా నటించేందుకు మాత్రం అంగీకరించలేదు. అనీల్‌రావిపూడితో మరో కథను సిద్దం చేయాల్సిందిగా చెప్పాడు. దాంతో ఆ కథను రవితేజకు వినిపించడం, దిల్‌రాజు సలహాతో రవితేజ ఓకే చెప్పడం జరిగింది. దిల్‌రాజు నమ్మకంను నిలుపుకున్న అనీల్‌రావిపూడి రవితేజకు సూపర్ హిట్‌ను ఇచ్చాడు. ఇప్పుడైనా అనీల్‌కు ఎన్టీఆర్ ఓకే చెప్తాడేమో చూడాలి.