ఎయన్నార్‌ రెడీ.. ఇక ఎన్టీఆర్‌ కావాలి!

ntr role not fixed in savitri biopic movie mahanati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు సినిమా లెజెండ్స్‌ అని ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లను అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వీరితో పాటు హీరోయిన్స్‌లో సావిత్రి తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోతారు. మహానటిగా గుర్తింపు దక్కించుకున్న సావిత్రి జీవిత కథాంశంతో నాగ్‌ అశ్విన్‌ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కీర్తిసురేష్‌ టైటిల్‌ రోల్‌లో సమంత ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. సావిత్రి జీవిత చరిత్ర సినిమాలో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లను చూపించకుంటే ఆ సినిమా అసంపూర్తి అని చెప్పుకోవచ్చు. సావిత్రి కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను ఎన్టీఆర్‌ మరియు ఏయన్నార్‌లతో కలిసి నటించారు.

mahanati-movie

‘మహానటి’ చిత్రంలో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల పాత్రల్లో ఎన్టీఆర్‌, చైతూలు నటిస్తారంటూ ప్రచారం జరిగింది. కాని వారిద్దరిని నాగ్‌ అశ్విస్‌ అస్సలు అప్రోచ్‌ కాలేదు. ఏయన్నార్‌ పాత్రకు తాజాగా విజయ్‌ దేవరకొండను ఎంపిక చేయడం జరిగింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఎన్టీఆర్‌ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేస్తారా అని సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

savithri

ఇప్పటికే నాగ్‌ అశ్విన్‌ ఇద్దరు మగ్గురు యువ హీరోలను సంప్రదించాడని, త్వరలోనే వారిలోంచి ఒక్కరిని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతుంది. ముగ్గురు హీరోల్లో ఒక హీరో నాని ఉన్నాడు. మరి ఎన్టీఆర్‌గా నాని నటిస్తాడా లేదా మరో హీరో ఎవరైనా ఎన్టీఆర్‌ పాత్రను పోషిస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ షూటింగ్‌ జరుపుకుంటున్న ‘మహానటి’ చిత్రంను వచ్చే సంవత్సరం వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.