రాజమౌళి తండ్రి మంచి నిర్ణయం

Vijayendra Prasad takes good decision

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో రచయితలు దర్శకుగా మారడం చాలా కామన్‌. ప్రస్తుతం ఉన్న పలువురు స్టార్‌ దర్శకుల్లో రచయితలు ఎక్కువ మంది ఉన్నారు. కొంత మంది రచయితలు దర్శకులుగా ప్రయత్నించి విఫలం అయ్యారు. రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాకు కథలు అందించడంతో పాటు, ఇంకా ఎన్నో చిత్రాలకు కథలు అందించి సూపర్‌ హిట్స్‌ను దక్కించుకున్న విజయేంద్ర ప్రసాద్‌ కూడా దర్శకత్వంను ప్రయత్నించాడు. రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయేంద్ర ప్రసాద్‌ వరుసగా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడు. దాంతో ఇక దర్శకత్వంకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 

‘రాజన్న’, ‘శ్రీవల్లి’ చిత్రాలను తెరకెక్కించిన విజయేంద్ర ప్రసాద్‌ ఇకపై దర్శకత్వంను చేయకూడదని నిర్ణయించుకున్నాడు. దేశం గర్వించదగ్గ చిత్రాలను తెరకెక్కించి రాజమౌళి తండ్రి ఇలాంటి చిత్రాలు చేశాడు అంటూ ఇప్పటికే విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తన కొడుకు రాజమౌళి పరువు ఇంకా తీయకూడదు అనే ఉద్దేశ్యంతో దర్శకత్వంకు గుడ్‌ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడు కూడా దర్శకత్వం ఆలోచన చేయను అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా తమిళంలో తెరకెక్కిన విజయ్‌ ‘మెర్సల్‌’ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్‌ స్క్రీన్‌ప్లే అందించాడు. ఆ సినిమా విజయంతో విజయేంద్ర ప్రసాద్‌కు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. త్వరలోనే ఒక బాలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమాకు కథను అందించబోతున్నాడు. ప్రస్తుతం కథ సిద్దం అవుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.