జూనియర్ ఎన్టీఆర్ ఓ మంచి పని కోసం హైదరాబాద్ పోలీసులతో చేతులు కలిపాడు. ఆన్ లైన్‌లో అపరిచితులతో స్నేహం చేయడం ఎంత ప్రమాదమో వివరిస్తూ తారక్ ఒక వీడియో చేశాడు. తారక్ వ్యాఖ్యానం కంటే ముందు ఇందులో ఒక వీడియో చూపించారు.
ఒక అమ్మాయి తన గదిలో ఏడుస్తూ ఉంటే తన స్నేహితురాలు వచ్చి ఏమైందని అడుగుతుంది. ఫేస్ బుక్‌లో ఒక అబ్బాయితో పరిచయం జరగడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం.. అతను ప్రపోజ్ చేయగా.. ఆ అమ్మాయి ఓకే చెప్పడం.. తర్వాత ఆ అమ్మాయి నగ్న చిత్రాలు అడిగితే ఆమె పంపడం.. వాటిని పెట్టుకుని అతను ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేయడం.. ఆ అమ్మాయి తీవ్ర మానసిక వేదనకు గురి కావడం.. ఇలా సాగుతుందా వీడియో.
ఇది ముగిశాక ఆన్ లైన్ స్నేహాలతో జాగ్రత్తగా ఉండాలని.. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని.. అపరిచిత వ్యక్తులతో సన్నిహితంగా ఉండొద్దని.. అప్రమత్తంగా ఉండాలని తారక్ హితవు పలికాడు. హైదరాబాద్ సైబర్ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో అమ్మాయిలు ఈజీగా కనెక్టవుతారని అతడితో ఈ వీడియో చేయించినట్లున్నారు పోలీసులు.