అప్పుడే టైటిల్‌ ఫిక్స్‌ చేశారా?

NTR Trivikram Movie Title On Silent Mode
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కబోతుంది. రాధాకృష్ణ నిర్మించబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎంపిక అయ్యింది. మరో హీరోయిన్‌ను కూడా ఈ చిత్రం కోసం ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఇక ఒక ముఖ్య పాత్రకు మీన లేదా మరో సీనియర్‌ హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే నటీనటుల ఎంపిక పూర్తి కాబోతుంది. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంకు టైటిల్‌ను కూడా దాదాపుగా ఫిక్స్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

త్రివిక్రమ్‌ తన ప్రతి సినిమాకు కూడా చాలా విభిన్నమైన టైటిల్‌ను పెడుతూ వస్తున్నాడు. త్రివిక్రమ్‌ గత చిత్రాల టైటిల్స్‌ను చూస్తే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ఎన్టీఆర్‌ చిత్రం కోసం చాలా విభిన్నమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ కోసం ‘సైలెంట్‌ మోడ్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాడట. ఈ టైటిల్‌ ఇంగ్లీష్‌ పదం అవ్వడం వల్ల ప్రేక్షకుల్లో రిజిస్ట్రర్‌ అవ్వడానికి సమయం పడుతుంది. అందుకే టైటిల్‌ను ముందే ప్రకటించాలని భావిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇంగ్లీష్‌ టైటిల్‌ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్‌లో టైటిల్‌ వల్ల మాస్‌ ఆడియన్స్‌కు కాస్త దూరం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే సైలెంట్‌ మోడ్‌ అనేది ఈమద్య చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదని మరి కొందరు భావిస్తున్నారు.