RRR మూవీకి బెస్ట్​ యాక్టర్​గా NTRకు SIIMA అవార్డు వచ్చింది ..

RRR మూవీకి బెస్ట్​ యాక్టర్​గా NTRకు SIIMA అవార్డు వచ్చింది ..
Latest News

టాలీవుడ్ స్టార్ హీరో.. పాన్ ఇండియా స్టార్.. గ్లోబల్ హీరో.. యంగ్ టైగర్.. ఇదంతా వింటుంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో అర్ధమవుతుంది కదా. ఇంకెవరూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించే. డైలాగ్ డెలివరీలో.. యాక్షన్​లో.. అదిరిపోయే డ్యాన్స్ చేయడంలో.. అంతకుమించి నటనలో ఎన్టీఆర్​తో పోటీ పడగల యంగ్ హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేరనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్​లో కుమురంభీం పాత్రలో ఎన్టీఆర్ నటన అత్యద్భుతం. ఆయన నటనకు కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ ఇండియా.. కాదు కాదు.. ప్రపంచమే ఫిదా అయిపోయింది . అందుకే ఆ సినిమాలో నటనకు ఎన్నో ప్రశంసలు.. పురస్కారాలు దక్కాయి.

Untitled design 2023 09 16T103338.234

ఇక తాజాగా దుబాయ్​ వేదికగా జరుగుతున్న సైమా 2023లో ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ చిత్రానికిగానూ తారక్​.. ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. కుమురం భీం పాత్రను ఆదరించిన ప్రేక్షకులకు ముఖ్యంగా తన అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తారక్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

‘కుమరం భీమ్ పాత్రకు నన్ను మళ్ళీ మళ్లీ నమ్మినందుకు నా జక్కన్నకు థాంక్స్. నా కో స్టార్​, మై బ్రదర్​, ఫ్రెండ్​ రామ్ చరణ్​కు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు… నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా బాధ పడినందుకు… నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు… నా అభిమాన సోదరులు అందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాను.” అని తారక్​ భావోద్వేగంగా మాట్లాడారు.