రెండు విభిన్న పాత్రలతో #NTR31..!

NTR's acting will come in two different roles...
NTR's acting will come in two different roles...

ఎన్టీఆర్ నుండి మరో మూవీ ప్రారంభం కానుంది. అది నీల్ దర్శకత్వంలో వస్తుంది. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ రెండు పాత్రల మధ్య డ్రామా చాలా కొత్తగా ఉంటుందని, ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు యాక్షన్ ప్రేమికులకు ఈ సినిమా కనుల విందుగా ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఇంటెన్స్ క్యారెక్టర్ తో పాటు మరో వైల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

NTR's acting will come in two different roles...
NTR’s acting will come in two different roles…

ఇటీవల, చిత్రబృందం ఈ పవర్‌హౌస్ ప్రాజెక్ట్ కోసం సిద్ధం కావాలని ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసింది. మరి, ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోందని తెలిసింది . కియారా నిజంగానే ఎన్టీఆర్ సరసన నటిస్తే, ఆ క్రేజ్ మరింత పెరుగుతుంది. అలాగే, ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్రకు కూడా స్కోప్ ఉందని, ఆ పాత్ర కోసం మరో స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారని సమాచారం.