సముద్రంలో ఎన్టీఆర్ భారీ యాక్షన్…‘దేవర’ నుంచి దిమ్మతిరిగిపోయే అప్డేట్..!

సముద్రంలో ఎన్టీఆర్ భారీ యాక్షన్...‘దేవర’ నుంచి దిమ్మతిరిగిపోయే అప్డేట్..!
Movie News

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా ‘దేవర’. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ను సముద్రం నేపథ్యంలో తెరకెక్కుస్తున్నారు. తాజాగా ఈ సినిమా కి సంబంధించిన ఒక అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr Ntr), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్నమూవీ ‘దేవర’. తారక్‍కు జోడీగా జాన్వీ కపూర్, పవర్‍ఫుల్ విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ చిత్రం షూటింగ్ మెుదలైనప్పటి నుంచి ఎక్కువగా యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. తాజాగా మరో భారీ యాక్షన్ సీన్స్ ను తీసే పనిలో నిమగ్నమయ్యారు కొరటాల శివ . ఈ ఫైట్ ను కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ అండర్ వాటర్ ఫైట్ సన్నివేశాలను ఏకంగా 20 రోజులపాటు తీయనున్నారు. దీని కోసం మూడు రోజులపాటు తారక్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమా కే హైలెట్ గా నిలవబోతుందని సమాచారం.

సముద్రంలో ఎన్టీఆర్ భారీ యాక్షన్...‘దేవర’ నుంచి దిమ్మతిరిగిపోయే అప్డేట్..!
NTR

సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విఎఫ్ ఎక్స్ కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. ఈ చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు . ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 05న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించేసారు . ఆర్ఆర్ఆర్ మూవీ ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ ఎంతో కసితో ఈ మూవీ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఈ మూవీ తర్వాత బాలీవుడ్ లో వార్ 2లో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా చేస్తున్న ఈ మూవీ లో తారక్ విలన్‍గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.