‘వార్-2’లో ఎన్టీఆర్ అదిరిపోయే ఎంట్రీ!

NTR's stunning entry in 'War-2'!
NTR's stunning entry in 'War-2'!

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవ ‘వార్-2’ కోసం నార్త్ ఆడియెన్స్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మూవీ ని యశ్ రాజ్ స్పై యూనివర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది . .

NTR's stunning entry in 'War-2'!
NTR’s stunning entry in ‘War-2’!

అయితే, ఈ మూవీ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ స్ట్రెయిట్ ఎంట్రీ ఇస్తు్న్నారు . దీంతో తారక్ అభిమానులు ఈ మూవీ లో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘వార్-2’ సినిమా లో తారక్ ఎంట్రీ సీన్ గురించి తాజాగా బి-టౌన్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది . ఈ మూవీ లో పైరేట్ తరహా థీమ్‌తో తారక్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది .

ఈ సీక్వెన్స్‌లో భారీ యాక్షన్ డోస్ ఉండనుందని.. తారక్ చేసే స్టంట్స్ ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురిచేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో తారక్ ఫేస్ టు ఫేస్ సీన్స్ అయితే ప్రేక్షకులకి గూస్‌బంప్స్ తెప్పించబోతున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ ని 2025 ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.