సమాజం వేగంగా మారిపోతోంది. దానికి తగ్గట్లుగానే మనిషి అవసరాలు మారిపోతున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకుని ముందుకు సాగాలంటే ఒకరికొకరు సంబంధాలు చాలా చాలా దృఢంగా ఉండాలి. స్నేహాస్తం అందించేవారి పట్ల కృతజ్ఞతా భావం చూపించాలి. ఇదే ఇప్పుడు చాలామంది స్త్రీల విషయంలో పక్క దోవ పట్టిస్తున్నట్టు పలు సర్వేల్లో వెల్లడవుతోంది. మామూలుగా ఇప్పుడు స్కూల్ వయసులోనే ప్రేమ అంటూ మొదలుపెడుతున్నా, అవి కాలేజ్ తర్వాత ఆఫీస్ స్టేజ్ కి వచ్చేనాటికి దాని అర్ధం మారిపోతోంది.
ఇదివరకు వేర్వేరు కుటుంబాలు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు – అబ్బాయిలు కలిసి తిరగడం చాలా చాలా అరుదైన విషయంగా కనిపించేది. ఇపుడు ఉద్యోగరీత్యా రాష్ట్రాల సరిహద్దులను దాటేసి వచ్చేస్తున్న అమ్మాయిలతోపాటు అబ్బాయిలు కూడా కలిసే ఉంటూ దానికి లివిన్ అని ఒక పేరు కూడా పెట్టుకున్నారు. ఉద్యోగం చేసే చోట హలో.. హాయ్.. అంటూ మొదలైన పరిచయం.. ఒకరి అభిరుచులు ఇంకొకరికి నచ్చితే ఇంకాస్త ముందుకు వెళ్లిపోతోంది. వీకెండ్లూ.. పిజ్జా హట్లూ.. మల్టీప్లెక్స్‌లూ… అంతకు మించి అంటూసాగుహున్నారు.
ఉద్యోగరీత్యా ఉన్న అనుబంధాన్ని కాదనలేని ఓ బలహీన స్థితిలో చాలామంది అమ్మాయిలు సెక్స్‌కు ఏదో ఒకరోజు ఓకే చెప్పేస్తున్నారని ఇటీవల ఒకే సర్వే తేల్చింది. అసలు ఇలా మొదలైన సంబంధం పెళ్లికి దారితీస్తుందన్న నమ్మకం కూడా చాలామందికి ఉండదట. ఎందుకంటే ఎక్కడో అబ్బాయి.. ఇంకెక్కడో అమ్మాయి. ఊరుకాని ఊరు.. కానీ వృత్తిరీత్యా ఒకేచోట. అందుకే ఆఫీసు వరకే ఆ సంబంధం.. ఆ సహాయం, బదిలీ అయితే మళ్లీ అంతా కొత్తే.. మళ్లీ కొత్త స్నేహం అని తేలింది. అది బాస్ ని మెప్పించడానికా లేక తన అవసరాల కోసమా అనేది పక్కన పెడితే ఆఫీస్ లో ఈ వ్యవహారాలు చాలా కామన్ అని నలుగురిలో ఒకరు తేల్చి చెప్పారట సర్వే వారికి…kalikaalam అనుకోవడం తప్ప మనం మాత్రం ఏమి చేయగలం.