ఓంకార్‌ పద్దతి అర్థం కావట్లేదు!

Ohmkar Sixth Sense TV Game show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బుల్లి తెరపై విలక్షణ యాంకర్‌గా పేరు తెచ్చుకుని వెండి తెరపై కూడా విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఓంకార్‌. ఇటీవలే ఈయన నాగార్జున, సమంత ముఖ్య పాత్రలో నటించిన ‘రాజు గారి గది 2’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ చిత్రం తర్వాత సమంత ‘యూటర్న్‌’ రీమేక్‌కు ఓంకార్‌కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. కాని రీమేక్‌ చేసే ఆసక్తి తనకు లేదు అంటూ ఓంకార్‌ ఆ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరష్కరించాడు. ఇంకా పలు చిత్రాలు కూడా ఈయన చెంతకు వచ్చాయి. పలువురు నిర్మాతలు ఈయనకు అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కాని ఈయన మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు.

సినిమా సక్సెస్‌ అయ్యి, వరుసగా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో కూడా ఓంకార్‌ మళ్లీ బుల్లి తెరపై సందడి చేయాలనుకుంటున్నాడు. కొత్త గేమ్‌ షో సిక్త్‌సెన్స్‌తో మాటీవీలో రాబోతున్నాడు. ఇప్పటి వరకు సౌత్‌ బుల్లి తెరపై రాని సరికొత్త గేమ్‌ను ఓంకార్‌ సెలబ్రెటీలతో ఆడివ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక సంఘటనను చూపించి, ఆ సంఘటన తర్వాత జరిగే సంఘటనను ఊహించే గేమ్‌ షోతో ఓంకార్‌ రాబోతున్నాడు. మొత్తానికి ఓంకార్‌ మరోసారి బుల్లి తెరపై సెన్షేషన్‌ క్రియేట్‌ చేస్తాడేమో చూడాలి.