రాజుగారి గదితో వెంకటేష్‌కు సంబంధం ఏంటి?

Venkatesh to do Raju Gari Gadhi 3 movie with Ohmkar Direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నాగార్జున ముఖ్యపాత్రలో ఓంకార్‌ దర్శకత్వంలో ప్రసాద్‌ వీ పొట్లూరి నిర్మించిన చిత్రం ‘రాజుగారి గది 2’. ఈ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘రాజు గారి గది’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకు ఈ సినిమాతో కనెక్షన్‌ లేకున్నా కూడా టైటిల్‌ బాగుందనే ఉద్దేశ్యంతో హర్రర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది కనుక ఆ టైటిల్‌ను నాగార్జున పెట్టేందుకు ఓకే చెప్పాడు. ఇటీవల హర్రర్‌ కామెడీ సినిమాలకు మంచి ఆధరణ ఉంది. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రివ్యూ టాక్‌ను బట్టి చూస్తుంటే ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడికి డబుల్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది.

‘రాజు గారి గది 2’ సక్సెస్‌ అవ్వడం ఖాయం అని, ఆ వచ్చే సంవత్సరం ‘రాజు గారి గది 3’ చిత్రాన్ని కూడా చేయబోతున్నట్లుగా ఇటీవలే దర్శకుడు ఓంకార్‌ చెప్పుకొచ్చాడు. నాగార్జున కూడా ఆ విషయంపై స్పందించాడు. మంచి కథతో వస్తే ‘రాజు గారి గది 3’లో చేసేందుకు తనకేం అభ్యంతరం లేదని చెప్పుకొచ్చాడు. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు ఓంకార్‌ ‘రాజు గారి గది 3’ని విక్టరీ వెంకటేష్‌తో చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. తాను ఇప్పటికే సిద్దం చేసుకున్న కథకు వెంకటేష్‌ అయితే బాగా సూట్‌ అవుతాడని భావిస్తున్నాడట. ఇప్పటికే వెంకటేష్‌ను కలిసిన ఓంకార్‌ స్టోరీ లైన్‌ను వినిపించాడు.

‘రాజు గారి గది 2’ సక్సెస్‌ అయితే వెంకటేష్‌ వెంటనే ఓంకార్‌ను పిలిచి మరీ డేట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న వెంకటేష్‌ ‘గురు’ సినిమా తర్వాత మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. బాలీవుడ్‌లో సక్సెస్‌ అయిన ‘హిందీ మీడియం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు వెంకీ ఆసక్తిగా ఉన్నాడు. నందినిరెడ్డి దర్శకత్వంలో ఆ రీమేక్‌ ఉండబోతుందని అంటున్నారు. ‘రాజు గారి గది 2’ సక్సెస్‌ అయితే ‘హిందీ మీడియం’ రీమేక్‌ ‘తెలుగు మీడియం’ కంటే ముందు వెంకటేష్‌ ‘రాజు గారి గది 3’ చేస్తాడేమో చూడాలి.