దీపావళికి అజ్ఞాతవాసి ఖాయం

pawan-kalyan-and-trivikram-movie-title-ajnathavasi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఇది పవన్‌ కళ్యాణ్‌ 25వ సినిమా అవ్వడంతో మరింతగా అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ మరియు ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడో పూర్తి అయ్యి విడుదల అవ్వాల్సి ఉంది. కాని పవన్‌ రాజకీయాలు మరియు ఇతర బిజీ షెడ్యూల్‌ కారణంగా సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయడంలో విఫలం అయ్యారు.

ఇక దసరాకు ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు టైటిల్‌పై అధికారిక ప్రకటన రాలేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దసరాకు మిస్‌ అయిన టైటిల్‌ను దీపావళికి ప్రకటించనున్నారట. త్రివిక్రమ్‌ సినిమాల టైటిల్స్‌ ఎప్పుడు కూడా విభిన్నంగా ఉంటాయి. అలాగే ఈసారి కూడా పవన్‌ సినిమా కోసం కూడా త్రివిక్రమ్‌ విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. కథానుసారంగా సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను త్రివిక్రమ్‌ ఖరారు చేయడం జరిగింది, పవన్‌కు కూడా ఇదే టైటిల్‌ బాగా నచ్చిందట. అందుకే ఈ సినిమాకు అజ్ఞాత వాసి టైటిల్‌ దాదాపు ఖాయం అని సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతుంది.

ప్రస్తుతం పవన్‌ మరియు ముఖ్య యూనిట్‌ సభ్యులతో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. వచ్చే నెలలో విదేశాల్లో పాటల చిత్రీకరణ జరిపి సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు. అందుకే సినిమాను నవంబర్‌లో పూర్తి చేయాలని త్రివిక్రమ్‌ పట్టుదలతో ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాలో పవన్‌కు జోడీగా కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌ను హీరోయిన్స్‌గా ఎంపిక చేయడం జరిగింది.