ఒడిషా గవర్నర్ గణేశీ లాల్ సతీమణి సుశీలా దేవి కరోనా కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. రాష్ష్ర్ట ప్రథమ మహిళ సుశీలా దేవి ఆదివారం రాత్రి చనిపోయిందని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసింది. కాగా నవంబర్ 2న గవర్నర్ గణేశీ లాల్, ఆయన భార్యతో పాటు నలుగురు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వీరంతా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా, అనారోగ్యం క్షీణించి సుశీలా దేవి గతరాత్రి మరణించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ సహా పలువురు సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.