ప్రయాణీకుల భద్రత కోసం ప్రయాణించే సమయాలను పర్యవేక్షించబోతున్న “ఓలా”

ola auto booking

ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఓలా సంస్థ వారు రియల్ టైమ్ రైడ్ పర్యవేక్షణ అనే ఒక సిస్టంని మంగళవారం ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఆ సంస్థ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ గార్డియన్ భాగంగా, అన్ని ప్రయాణాలకు AI ద్వారా ట్రాక్ చేయబడుతుంది అని , ఒకవేళ మార్గంలో వ్యత్యాసాల వంటి ఏమైనా ఎదురైతే రైడ్ సూచికలను విశ్లేషించడం, ఊహించని మరియు మధ్యలో వేర్వేరు స్టాప్లు. ప్రయాణ సమయం మరియు ఇతర రైడ్ సూచికల ఆధారంగా సృష్టించబడే భద్రతా ట్రిగ్గర్లను ఓలా యొక్క భద్రతా ప్రతిస్పందన బృందం పర్యవేక్షిస్తుంది అని ఆ సమస్త పేరుకొనింది.

ola auto

బెంగళూరు, ముంబై, పూణేలలో వంటి ప్రదేశాలలో భద్రతను కల్పించే వాస్తవిక పర్యవేక్షణ వ్యవస్థ “ఓలా గార్డియన్”, అనే సిస్టం ని ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటనలో పేరుకొంది. ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్స్ (AI) మరియు మెషీన్ లెర్నింగ్ టూల్స్పై ని ఢిల్లీ , కొలకత్తా  మరియు ఇతర భారతీయ ప్రధాన నగరాలలో 2018 అక్టోబర్ చివరి నాటికీ ప్రవేశ పెట్టబోతున్నామని అని ఓలా సంస్థా తెలిపింది. ప్రయాణీకుల భద్రత గురించి గత కొద్దీకాలంగా తీవ్రమైన విమర్శలు ఎదురుకున్న ఓలా సమస్త వాటిని నివారించేందుకు ఈ పద్దతిని ప్రవేశ పెట్టబోతోంది అని తెలుస్తుంది, మరి ముఖ్యం గా భారతీయ నగరాల్లో మహిళలను భద్రత గురించి క్యాబ్ సంస్థల చాల మంది ప్రశ్నించడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పద్ధతిని అమలు చేయబోతుంది.