మొద్దు శ్రీను హత్యకేసులో నిందితుడైన ఓం ప్రకాశ్ అనారోగ్యంతో మృతి చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గతకొంత కాలంగా బాధపడుతున్న ఆయన.. సోమవారం విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును 2008 నవంబర్ 9న జైలులోనే డంబుల్‌తో కొట్టి హత్య చేశాడు.
ఈ కేసులో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓంప్రకాశ్‌కు జీవిత ఖైదు విధించింది. 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైలులో ఓం ప్రకాశ్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ.. సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఓం ప్రకాశ్ తల్లి సరోజనమ్మ కూడా అనారోగ్యంతో గత ఏప్రిల్ మృతిలో మృతిచెందారు.