బరిలోకి దిగి తానేంటో సత్తా చాటబోతున్న సింధు

బరిలోకి దిగి తానేంటో సత్తా చాటబోతున్న సింధు

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాక సన్మానాలు, ప్రశంసల వెల్లువతో తీరిక లేకుండా ఉన్న తెలుగు షట్లర్ పీవీ సింధు.. మరో టోర్నీకి సిద్ధమైంది. మంగళవారం ప్రారంభం కానున్న చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్‌లో అడుగుపెట్టనుంది. చాంపియన్‌షిప్ తుదిపోరులో యమగూచిని ఓడించి పసిడిని పట్టిన సింధు.. మరోసారి అదే అద్భుత ప్రదర్శనతో చైనా టైటిల్‌ను సైతం కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మాజీ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లీ షిరూతో సింధు బుధవారం తలపడనుంది. ప్రస్తుత ఫామ్ చూస్తే క్వార్టర్స్ వరకు సింధు అలవోకగా చేరుకునే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్టు జరిగితే క్వార్టర్స్‌లో ఐదో సీడ్ సింధు… మూడో సీడ్ చెన్ యూఫీ(చైనా)తో తలపడాల్సి ఉంటుంది.