సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్ తేజ్, పూజ హెగ్డే జంటగా నటించిన వాల్మీకి చిత్రం

సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’.తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో హరీష్ శంకర్ కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. పూజా హెగ్డే ప్రధాన నాయిక. ప్రముఖ యువ కథానాయకుడు అథర్వా మురళి ఒక ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. మృణాళిని రవి, బ్రహ్మాజి, బ్రహ్మానందం, శత్రు తదితరులు నటించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు ఒక మంచి ఉత్సాహాన్నిచ్చింది. అయానక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈనెల 20 శుక్రవారం రోజున ‘వాల్మీకి’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మరోవైపు, వరుణ్ తేజ్ తొలిప్రేమ, ‘F2’తో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నారు. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా పక్కా మాస్ మూవీని ఎంపిక చేసుకున్నారు. ఇప్పటి వరకు చూడని లుక్‌లో వరుణ్ కనిపించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సినీ ప్రేమికులు సైతం వరుణ్ కిరాక్ లుక్ చూసి వహ్వా అన్నారు. ఇక టీజర్, ట్రైలర్, పాటల ప్రోమోలు చూసిన తరవాత ‘వాల్మీకి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి