కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడు…..

కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడు.....

గుడివాడ శివారులోని నాగవరప్పాడు కొలుసువారి వీధికి చెందిన శ్రీకాంత్ టైల్స్ పని చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన అనూష(21) అనే యువతిని ప్రేమించి పెద్దలను ఎదిరించి రెండేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం కావడంతో అనూష ఎలాంటి కట్నకానుకలు తీసుకురాకుండానే అత్తింట్లో అడుగుపెట్టింది. దీంతో కొద్దిరోజులకే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. భర్తతో పాటు అత్త ధనమ్మ నిత్యం ఆమెను వేధించేవారు. ఈ క్రమంలోనే అనూష తండ్రి ఇటీవల స్థలం విక్రయించినట్లు శ్రీకాంత్‌కు తెలిసింది. దీంతో ఆ డబ్బులు తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.

ఇదే విషయమై మంగళవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కట్నం కోసం వేధిస్తూ ఆమె ప్రాణాలనే బలిగొన్నాడు. చున్నీతో గొంతు నులిమి చంపేసి పరారయ్యాడు. కృష్ణా జిల్లా గుడివాడలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.కొందరు ఇంట్లోకి వెళ్లి చూడగా అనూష విగతజీవిగా పడి ఉంది. దీంతో వారు అనూష కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

డీఎస్పీ సత్యానందం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.దీంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.