మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు….

మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు....
Ashu

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపుతోంది. తెలుగు సినీ పరిశ్రమల మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. బీబాస్ ఆషు రెడ్డి ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్ లోతేలినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె పేరు ఇప్పుడు వైరల్ అవుతుంది. తాజాగా ఇదే విషయంపై ఆమె స్పందించింది.తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అషు రెడ్డి ఫైర్ అయింది. డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజలు లేవని పేర్కొంది .

సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలకి ఆమెకి ఎవరితోనూ డ్రగ్స్ సంబంధాలు లేవని పేర్కొంది . అవన్నీ తప్పుడు వార్తలని ఆమె కొట్టిపారేసింది. అవసరం అనుకుంటే విచారణ ఎదుర్కొంటానని దానికి సంబంధించిన అధికారులకు వాస్తవం ఏమిటో తెలియజేస్తా అని తెలిపింది. కానీ తన ఫోన్ నంబర్ తన పర్మిషన్ లేకుండా బహిరంగంగా ప్రదర్శిస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరికలు చేసింది. కాగా, ఇదే కేసులో నటి సురేఖ వాణి ఆమె కూతురు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.