బెల్లంకొండకు ఇదేం పిచ్చిర బాబోయ్‌..!

One-Crore-Offer-To-Pooja-He

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్నో భారీ చిత్రాలను నిర్మించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్‌ చేసుకున్న నిర్మాత బెల్లంకొండ సురేష్‌ గత కొంత కాలంగా సినిమా నిర్మాణంకు పూర్తి దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే తన కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమాల విషయంలో మాత్రం పూర్తిగా తల దూర్చుతున్నాడు. అధికారికంగా బెల్లంకొండ సురేష్‌ కొడుకు సినిమాలను నిర్మించకున్నా అనధికారికంగా మాత్రం మొత్తం కొడుకు సినిమాలకు పెట్టుబడి సురేష్‌దే అనే టాక్‌ వినిపిస్తుంది. కొడుకును హీరోగా నిలిపేందుకు ఆయన చాలా కష్టపడుతున్నాడు.

మొదటి సినిమాతోనే భారీ బడ్జెట్‌ను పెట్టి ‘అల్లుడు శీను’ అంటూ నిర్మించాడు. వివి వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో హీరోయిన్‌గా సమంత, తమన్నాలు నటించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో రొమాన్స్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దాంతో తనయుడి తర్వాత సినిమా కోసం పూజా హెగ్డేను బుక్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ చిత్రాల్లో నటించిన పూజా హెగ్డే 20 లక్షల పారితోషికాన్ని తీసుకుంది. ఇప్పుడు ‘డీజే’ చిత్రంలో నటించినందుకు గాను దాదాపు 40 లక్షల పారితోషికం తీసుకుంది. ‘డీజే’ భారీ విజయం సాధించడం ఖాయం అని భావిస్తున్న బెల్లంకొండ తన తనయుడి తర్వాత సినిమా కోసం పూజా హెగ్డేను ఏకంగా కోటి రూపాయలు ఇచ్చి బుక్‌ చేసినట్లుగా తెలుస్తోంది.