నల్గొండ జిల్లాలో దారుణం,ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలకలం సృష్టించిoదో చెప్పనవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. అలాంటి ఘటనే మళ్ళీ ఇపుడు చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన మరో పరువు హత్య కలకలం రేపింది.
మూడు నెలల క్రితం తిర్యాని మండలం నాయకపు గూడాకు చెందిన నవీన్, కావ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. కావ్య తండ్రి కులాంతర వివాహం కావడం వల్ల పెళ్ళికి ఒప్పుకోలేదు. వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల కావ్య తండ్రి తట్టుకోలేక నవీన్ పై కత్తితో దాడికి దిగాడు.కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల కక్ష పెంచుకుని కత్తితో దాడి చేసి వెంటనే పారిపోయాడు. గాయంతో రక్తపు మడుగులో ఉన్న నవీన్‌ను స్థానికులు దగ్గరలో ఉన్న తిర్యాని ప్రభుత్వ ఆస్పత్రికి తిస్కువెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కావ్య తండ్రి పరారీలో ఉన్నట్టు తెలిపారు