అమెరికా పక్కా వ్యూహంతో ఇస్లామిక్ స్టేట్-ఐసిస్ చీఫ్ని హతమార్చింది. సహాయంతో డీఎన్ఏ పరీక్ష ద్వారా కుర్దీష్ నేతృత్వంలోని సిరియా డెమొక్రటిక్ ఫ్రంట్ సహాయం తీస్కుని అబుబాకర్ ఎక్కడ ఉన్నడో తెలసు కుంది. అబుబాకర్ లోదుస్తులను సేకరించి రహస్య వర్గాల ద్వారా డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించినట్టు ఎస్డీఎఫ్ సలహాదారు పొలట్ కాన్ ట్విటర్ ద్వారా తెలిపారు.
ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీతో పాటు, మరో ఉగ్ర వాది డెల్టా ఫోర్స్ ఆపరేషన్లో చని పోయినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ప్రత్యేక బలగాలు సిరియాలోని స్థావరంపై ప్రత్యేక బలగాలు దాడి చేయడంతో తనను తాను బాగ్దాదీ హతం చేసుకున్నాడని తన స్థానంలో ఉన్న ఇంకో వ్యక్తి చని పోయాడని ట్రంప్ ప్రకటించారు.
డీఎన్ఏ పరీక్ష ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో ఉన్న శరీర భాగాలపై జరిపి బాగ్దాదీవే అని నిర్దారణ చేసి అంత్యక్రియలు అంతర్జాతీయ ప్రామాణిక నిబంధనల ప్రకారం జరిపాము అని అమెరికా సైనిక బలగాల అధిపతి జనరల్ మార్క్ మిల్లీ తెలిపారు.