మండలంలోని నాగూరుకు చెందిన గొట్టాపు భార్గవ నాయుడు ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. షటిల్ కాక్‌లకు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్‌లో ఆర్డర్ ఇస్తే ఆదివారం వచ్చిన పార్శిల్లో పనికిరానివి, కాక్‌లకు డిప్పలు లేనివి ఉండడంతో ఆవాక్కయ్యాడు. ఆన్లైన్ షాపింగ్‌లో మోసం జరిగిందని గ్రహించి వెంటనే ఆ సంస్థ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి తిప్పి పంపించేశాడు.