కరోనా :ఎఫెక్ట్… మద్యం ఆన్ లైన్ విక్రయం.. లక్ష మోసం

కరోనా ప్రభావం కారణంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ఎలాంటి రవాణ జరగడం లేదు. అలాగే రోజురోజుకూ కరోనా తీవ్రస్థాయిలో విస్తరిస్తూ ఉంది. ఈ నేపధ్యంలో మద్యం ప్రియులకు ఇదో దుర్వార్తగా పరిణమించింది. మద్యం షాపులన్నీ బంద్ కావడంతో మద్యం ప్రియులు ఆన్ లైన్ అమ్మకాలపై దృష్టి పెట్టారు. అందుకోసం సెర్చ్ చేసి చివరకు ఓ చోట గమనించారు. ముంబైలోని చెంబూర్ లో ఓ దంపతులు మార్చి 24వ తేదీన ఆన్‌లైన్‌లో మద్యం కోసం ఆర్డర్ చేశారు. దాంతో ఏకంగా రూ1.03లక్షలు మోసానికి గురయ్యారు. మరి అదే ఒక్కోసారి లేనిదానికోసం జరిపే ప్రయత్నంలో అసలకే మోసపోవడం అంటే..

అసలేం జరిగింది అంటే… ఆన్‌లైన్ లో హోమ్ డెలివరీ మద్యం లావాదేవీల జరిపే షాప్ ఫోన్ నెంబర్ తెలుసుకున్నాడు. వెంటనే కాల్ చేయగా.. ఆన్‌లైన్ కొనుగోలు కోసం రూ.3,000 చెల్లించాలని విక్రేత వారిని కోరాడు. అలా చెప్పాడో లేదో వెంటనే బాధితుడి ఖాతా నుండి రూ.30,000 కట్ చేసుకున్నాడు. బాధితుడు వెంటనే దుకాణాన్ని ఫోన్ చేయగా.. ఆ మొత్తం పొరపాటున కట్ అయ్యాయని.. వెంటనే వాపసు చేస్తామని షాపు యజమాని చెప్పాడు. అలాగే… పలుమార్లు కట్ చేసుకుంటూ సుమారు ఆరుసార్లు ఓటీపీ కోరారు. ఇలా మొత్తం మీద రూ. 1.03 లక్షలు వైన్ షాప్ యజమాని దోపిడి చేశారు. ఆ తర్వాత షాపు యజమానికి కాల్ చేయగా తమకు డబ్బు జమ కాలేదని సరుకుని డెలివరీ చేయలేమని.. మరొక కార్డు ఉపయోగించి చెల్లింపులు జరపాలని తెలిపాడు. దీంతో కంగుతిన్న ఆ దంపతులు మోసం చేశారని భావించి తిలక్ నగర్ పోలీసులకు మార్చి 27వ తేదీన ఫిర్యాదు చేశారు.