“కంగువా 2” విషయంలో అతిగా నమ్ముకుంటున్నారా?

Overconfident about “Kangua 2”?
Overconfident about “Kangua 2”?

కోలీవుడ్ స్టార్ అండ్ వెర్సటైల్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ “కంగువా” కోసం అందరికీ తెలిసిందే. సూర్య కెరీర్ లోనే డిడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాగా ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు నుంచో కోలీవుడ్ లో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ గా దీనిని ప్రొజెక్ట్ చేస్తుండగా ఖచ్చితంగా ఈ మూవీ అంచనాలు అందుకుంటుంది అని మేకర్స్ అనుకుంటున్నారు.

Overconfident about “Kangua 2”?
Overconfident about “Kangua 2”?

అయితే ఈ మూవీ కూడా ప్రెజెంట్ ట్రెండ్ లో భాగంగా రెండు భాగాలుగా వస్తున్నా సంగతి అందరికి తెలిసిందే. మరి పార్ట్ 2 విషయంలో నిర్మాతలు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వారు అంటున్న దాని ప్రకారం కంగువా పార్ట్ 2 తో అయ్యితే ఎవరూ క్లాష్ కు వచ్చే సాహసం చెయ్యలేరని ఇప్పుడు నుంచే చెప్పేస్తున్నారు. ఇంకా మొదటి పార్ట్ విడుదలే కాలేదు అయినా కూడా పార్ట్ 2 కు మాత్రం ఎవరు నిలవలేరు అని కామెంట్స్ చేయడం అది వారి కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అనేది అర్ధం కావట్లేదు. మరి ఆ రేంజ్ లోనే మూవీ ని తెరకెక్కించారా లేదా అనేది తెలియాలి అంటే ఈ అక్టోబర్ 10 వరకు ఆగాల్సిందే.