Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావతి సినిమాలోని 26 సన్నివేశాలను తొలగించాలని దర్శక నిర్మాతలతో చెప్పలేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడు వాణి త్రిపాఠి టిక్కో చెప్పారు. ఈ సినిమా విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పై జరుగుతున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సినిమాలో కొన్ని సన్నివేశాలను సవరించాలని మాత్రమే దర్శక నిర్మాతలకు సూచించామన్నారు. చిత్రం టైటిల్ ను పద్మావత్ గా మార్చమని పేర్కొని, యూ\ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలిపారు. చిత్ర వివాదంపై దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇటీవల పార్లమెంట్ ప్యానెల్ తో సమావేశమై వివరణ ఇచ్చారు. 16వ శతాబ్దానికి చెందిన మాలిక్ మహ్మద్ రాసిన పద్మావత్ కవిత ఆధారంగా ఈ చిత్రం రూపొందించానని తెలిపారు.
చిత్ర నిర్మాణానికి రూ. 150కోట్ల వ్యయమయిందని తెలిపారు. భన్సాలీ వివరణ విన్న తర్వాత సినిమాలో కొన్ని సవరణలు చేయమని సెన్సార్ బోర్డ్ ఆదేశించింది. ఘూమర్ పాటలో అవసరమైన మార్పులు చేయాలని సూచించింది. అయితే సినిమాలో 26 సన్నివేశాలను తొలగించాలని చెప్పినట్టు ప్రచారం జరిగింది. డిసెంబరు 1న విడుదల కావాల్సిన పద్మావతి రాజ్ పుత్ ల ఆందోళనలు, సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు సీబీఎఫ్ సీ నుంచి క్లియరెన్స్ రావడంతో సినిమా విడుదలకు మార్గం సుగమమయింది.